Gastric Problems : రుతుపవనాలు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగిస్తాయి, అయితే వర్షకాలంలో ముఖ్యంగా జీర్ణశయాంతర (GI) వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా మందిలో అధికంగా ఉంటాయి. తేమతో కూడిన వాతావరణం వ్యాధికారక కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆహార కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్లో GI సమస్యలను నివారించడానికి, గట్ రోగనిరోధక శక్తిని పెంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం .
అధిక తేమ కారణంగా, ఆహార పదార్థాలు త్వరగా చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాజా ఉత్పత్తులు , ఆహారాలను తినేందుకు ఎంచుకోవాలి. వాటిని ఎక్కువసేపు నిల్వ చేయకూడదు. పాచిపోయిన, మిగిలిపోయిన ఆహారాన్ని తినడం మానుకోవాలి.వర్షాల సమయంలో రుచికరమైన వీధి అంగట్లో లభించే చిరుతిళ్లను తీసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వీధిలో లభించే ఆహారం తినటం వల్ల ఇన్ఫెక్షన్లు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇంట్లో వండిన ఆహారానికి తీసుకోవటం మంచిది. బయటి ఆహారం తీసుకోవాలనుకుంటే పరిశుభ్రమైన ఫుడ్ అవుట్లెట్లను ఎంచుకోవటం మంచిది.
ఆహారంలో ప్రోబయోటిక్స్ , సౌర్క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలలో గట్ ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, హానికరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.రోగనిరోధక శక్తిని పెంచే వేప మరియు తులసి వంటి రోగనిరోధక శక్తిని పెంచే మూలికలను రోజువారిగా తీసుకోవాలి. ఈ మూలికలు శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి వ్యాధికారక క్రిములతో పోరాడటానికి , జీర్ణవ్యవస్థను రక్షించడంలో సహాయపడతాయి.