Pawan Kalyan-Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ నటించిన బ్రో (Bro) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు అభిమానుల చూపుల అన్ని పవన్ చేతిలో ఉన్న ఇతర ప్రాజెక్ట్స్ పై పడింది. బ్రో తరువాత రిలీజ్ కి సిద్ధం అవుతున్న ప్రాజెక్ట్స్.. OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు. OG షూటింగ్ గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుంది. అయితే ఉస్తాద్ పరిస్థితే ఏమైందో తెలియడం లేదు. ఇటీవల ఈ మూవీ ప్రస్తుతానికి ఆగిపోయిందని, ఎలక్షన్స్ తరువాత పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపించాయి.
ఇక వార్తలు పై క్లారిటీ ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు.. దర్శకుడు హరీష్ శంకర్ ని ఎన్నిసార్లు అడిగినా రిప్లై రాకపోవడంతో మూవీ పై మరిన్ని రూమర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ మళ్ళీ పట్టాలు ఎక్కనుందట. పవన్ ఈ చిత్రాన్ని ఎలక్షన్స్ ముందుగానే రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడట. ఆల్రెడీ ఈ మూవీ మొదలుపెట్టిన సమయంలో హరీష్ శంకర్.. ఉస్తాద్ ని సంక్రాంతికి తీసుకు వస్తామంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ పండగా లక్ష్యంగానే ఈ మూవీ సిద్ధం కాబోతున్నట్లు సమాచారం.
ఈ మూవీకి సంబంధించి ఇప్పటికి ఒక షెడ్యూల్ మాత్రమే అయ్యింది. ఈ షెడ్యూల్ లో 10 శాతం షూటింగ్ పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ చిత్రం నుంచి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అందరిలో అంచనాలు పెంచేసింది. మళ్ళీ గబ్బర్ సింగ్ వంటి సినిమా ఇస్తాడని పవన్ అభిమానులు హరీష్ పై నమ్మకాలు పెంచేసుకున్నాడు. ఈ మూవీలో పవన్ కి సంబంధించిన పార్ట్ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేలా హరీష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.