Allu Arjun : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన (Upasana) తమ పెళ్ళైన 11 ఏళ్ళ తరువాత పండంటి ఆడబిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20న జన్మించిన ఆ పాపకి లలితా సహస్రనామం నుంచి స్ఫూర్తి పొంది క్లీంకార (Klin Kaara) అనే పేరుని పెట్టారు. ఇక ఈ మెగా ప్రిన్సెస్ కి ఆహ్వానం పలుకుతూ పలువురు స్టార్స్ విలువైన బహుమతులు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR).. స్పెషల్ గా డిజైన్ చేసిన బంగారు డాలర్స్‌ను పంపించినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా ఇప్పుడు మామయ్య అల్లు అర్జున్ కూడా బహుమతి పంపించినట్లు వినిపిస్తుంది. క్లీంకార కోసం బన్నీ బంగారు పలక పంపించాడట. బంగారు పలక అంటే చిన్న పిల్లలు రాసుకునేది అనుకున్నారేమో, అది కాదు. క్లీంకార పుట్టిన తేదీ, సమయం, అలాగే తనకి ఆ పేరుని ఎలా పెట్టారు అనే వివరాలను.. ఆ బంగారు పలక పై అల్లు అర్జున్ డిజైన్ చేయించాడట. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు గాని, బన్నీ ఐడియాకి మాత్రం అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గేమ్ చెంజర్ (Game Changer)లో నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఒక్క అప్డేట్ కోసం అభిమానులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల దర్శకుడు శంకర్ ఆగష్టులో మూవీ అప్డేట్ ఉండబోతుందని చిన్న హింట్ ఇచ్చాడు. కొన్ని రోజులు నుంచి ఆగష్టు 15న గేమ్ చెంజర్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరి శంకర్ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ ఇచ్చి చరణ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తాడో చూడాలి.