మాజీమంత్రి పొంగూరు నారాయణపై ప్రియా పొంగూరు చేసిన ఆరోపణలు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం డిమాండ్ !
నారాయణ విద్యా సంస్థలు అధినేత,మాజీమంత్రి పొంగూరు నారాయణ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే దర్యాప్తు జరిపించాలని నవతరంపార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రకటన విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ కూడా ఖచ్చితంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
నారాయణ మరదలు ప్రియా పై నారాయణ లైంగిక వేధింపులు, వ్యక్తిగత భౌతిక దాడులు సహించరాని తీవ్రమైన విషయాలు గా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయాలన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నారాయణ వ్యవహారం పై స్పందించి ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు.
giving food to the poor People in Malaysia మలేషియాలో పేదలకు అన్నదానం ◉ జగిత్యాల జిల్లావాసి ఔదార్యం Check Now
మహిళ గా బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతుంటే నారాయణ స్పందించకపోవడం సరికాదన్నారు. ఆధారాలను తీసుకుని ప్రియా పొంగూరు పోలీసులకు, మహిళా కమీషన్ కు పిర్యాదు చేయాలని ఆమెకు సూచించారు. ఆమెకు నవతరంపార్టీ నుండి అండగా ఉంటామని తెలిపారు.నారాయణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనలపై కూడా దర్యాప్తు కోసం నవతరంపార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.