Honey for Face : తేనె వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలానే అందాన్ని కూడా. మరి అందుకోసం ఏం చేయాలో చూద్దాం.తేనె అనేది ఎప్పట్నుంచో మన భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్నది. దీనిని ఉపయోగించడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. దీనిలోని గొప్పతనం తెలుసు కాబట్టే, చాలా మంది తేనెని ఆయుర్వేద వైద్యంలో వాడుతుంటారు. మరి అలాంటి తేనెతో అందాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.
తేనెలోని గుణాలు..
తేనెలో అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. దీనిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చర్మానికి మెరుపు, అందాన్ని అందించడంలో తేనె బాగా పనిచేస్తుంది. తేమని అందించి చర్మ రంధ్రాలను అన్‌లాగ్ చేస్తుంది.
పసుపు..
తేనెలో పసుపు కలిపి రాయడం వల్ల మీ చర్మ కాంతిని పెంచిన వారవుతారు. పసుపులో కర్కమిన్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అందుకోసం 2 టేబుల్ స్పూన్ల తేనె, అర టీ స్పూన్ వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి.
పెరుగు..
పెరుగు కూడా ప్రతి ఇంట్లోనూ ఉండనే ఉంటుంది. దీనిని రాయడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా మారుతుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. పెరుగుని వాడడం వల్ల చర్మానికి మాయిశ్చరైజింగ్ ఫీలింగ్ వస్తుంది. చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.
ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన క్లాత్‌తో ముఖాన్ని క్లీన్ చేయాలి.