Banana : అరటిపండు.. అందరికీ అందుబాటులో ఉండేదే . అలాంటి ఈ పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి.
ఆయుర్వేదం దాదాపు ప్రతి వ్యాధికి ట్రీట్మెంట్ చేసే వేల సంవత్సరాల పురాతన భారతీయ ఔషధం. దీని వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. వేల సంవత్సరాల క్రితం నుంచి ఆయుర్వేదాన్ని ఫాలో అవుతున్నారు. అయితే, ఆయుర్వేదం ప్రకారం ఆహారం విషయంలో కూడా కొన్ని పాటించాలి. అందులో భాగంగానే అరటిపండు తిన్నప్పుడు కొన్ని పాటించాలి. అవేంటో చూద్దాం.
అరటిపండు తిన్న తర్వాత..
అరటిపండు తినన్నప్పుడు, తర్వాత కొన్ని పనులు చేయొద్దొన్ని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల శరీరం పాడవుతుంది. స్త్రీ, పురుషులు శారీరక బలం తగ్గుతుంది. ఈ సమాచారాన్ని మలేషియా వైద్య పోషకాహార నిపుణుడు విపిన్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
నీరు వద్దు..
ఏదైనా పండు తిన్న వెంటనే నీరు తాగొద్దొని చెబుతున్నారు. ఈ నియమం అరటిపండ్లకి కూడా వర్తిస్తుంది. అరటిపండు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యలొస్తాయి. అరటిపండు తిన్న గంట తర్వాత మాత్రమే నీరు, డ్రింక్స్ తీసుకోవాలి.
రాత్రి అసలే వద్దు..
ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట తినొద్దు. దీని వల్ల కఫాన్ని పెంచుతుందని భావిస్తారు. అందుకే రాత్రిపూట ఆహారం తీసుకుంటే కఫం, దగ్గు, ఛాతీలో నొప్పి వంటి రావొచ్చు.
వేరేవాటితో కలిపి..
పాలతో కలిపి కూడా అరటిపండు తీసుకోవద్దు. అరటిపండుతో షేక్ చేసి తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం, నిజానికి అరటిపండ్లు, పాలు, పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. జీర్ణక్రియ సమస్యలొస్తాయి. చర్మ సమస్యలకి కారణమవుతుందని పోషకాహార నిపుణుడు విపిన్ చెప్పారు.