Iron Rich Drink: ఐరన్ మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకం. . శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి తోడ్పడుతుంది. మన శరీరంలో ఇతర హార్మోన్ల తయారీకి ఐరన్ అవసరం. ఇనుము లోపం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువవుతుంది. సాధారణ శక్తి, దృష్టి, జీర్ణశయాంతర ప్రక్రియలు, రోగనిరోధక వ్యవస్థను మెరుగురచడానికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచడానికి, శరీరంలోని అనేక విధులను సంరక్షించడానికి ఐరన్ సహాయపడుతుంది.
ఐరన్ లోపం కారణంగా.. స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువవుతాయి. యాంగ్జైటీ, ప్యానిక్ ఎటాక్స్, డిప్రెషన్, మతిమరుపు లాంటివన్నీ ఐరన్ లోపం లక్షణాలు. గుండె వేగం పెరగటం, చేతులు చల్లబడటం, తలనొప్పి, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఐరన్ లోపం వల్ల ఆలోచనల సామర్థ్యం, జ్ఞాపకశక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. కొన్ని ఐరన్ రిచ్ డ్రింక్స్ తాగితే.. ఐరన్ లోపం దూరం అవుతుంది. అవేంటో తెలుసుకోండి .
బీట్‌రూట్ జ్యూస్..
బీట్‌రూట్‌లో ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, బీటైన్, విటమిన్ సితో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్ జ్యూస్ లివర్ నుంచి విషాన్ని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను తీసుకోవడం మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. వంద గ్రాముల బీట్‌రూట్‌లో 0.8mg ఐరన్ ఉంటుంది. బీట్‌రూట్‌లోని విటమిన్ సి ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది.