Oil Massage for Hair : జుట్టు రాలడం చాలా కామన్. చాలా మంది చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు తెల్లబడుతుంది. జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యం, ఎక్కువ కెమికల్స్ షాంపూ వాడకం, వాతావరణంలోని ధూళి కాలుష్యం మొదలైనవి. ఈ రోజుల్లో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా జుట్టు సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
ప్రజెంట్ యువతలో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. అయితే, దీని వల్ల పురుషులు ఇబ్బంది పడుతున్నారు.
30 ఏళ్ళ జుట్టు రాలుతుంటుంది. దీంతో బట్టతల వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో హార్మోన్ల మార్పు, మానసిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, ఉప్పు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, కొన్ని సందర్భాల్లో ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది.పరిష్కారం ఏంటి అంటే ?
ఆయిల్ మసాజ్..
జుట్టుకి సంబంధించిన అనేక సమస్యలకి ఈజీ, ఎఫెక్టివ్ పరిష్కారం ఏంటంటే స్కాల్ప్ నుండి కుదుళ్ళ వరకూ నూనెని అప్లై చేసి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ఇలా వారానికి కనీసం 2, 3 సార్లు చేస్తే తలలోని స్కాల్ప్ భాగంలో రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు రాలడం అదుపులోకి వస్తుంది. జుట్టు సరిగ్గా పెరుగుతుంది.
మెంతులు..
వంటలో రుచిని పెంచేందుకు వాడే మెంతులు జుట్టు సమస్యలకి చక్కని పరిష్కారమని తెలుసా. ఈ చిన్న గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టు మూలాలకు పోషకాలని అందించి రాలడాన్ని తగ్గిస్తుంది.
మెంతులను వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, జుట్టరాలడాన్ని తగ్గించేందుకు ఇది చక్కని రెమిడీ నిపుణులు చెబుతున్నారు.