Banana Storing Tips: అరటిపండు ఇది అన్ని కాలాల్లోనూ సులభంగా లభిస్తుంది. ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. ఈ చక్కని పసుపు, బంగారం రంగులో ఉండే పండు చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది రుచిలోనే కాదు.. పోషకాలు అద్భుతంగా ఉంటాయి. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 , ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే.. అరటిపండ్లు ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉంటాయి. అయితే, వీటిని నిల్వ చేయడం కొంచెం కష్టమే. ఎంత తాజా అరటి పండ్లు తెచ్చినా రెండో రోజుకు బాగా పండి నల్లగా మారతాయి. వీటిని స్టోర్ చేసేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే.. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఆ టిప్స్ ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
పేపర్ బ్యాగ్‌లో పెట్టండి..
చాలా మంది ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లలో తెచ్చిన పండ్లను అలానే ఉంచేస్తూ ఉంటారు. ఇలా చేస్తే.. త్వరగా పండిపోతాయి. అరటిపండ్లను ప్లాస్టిక్ కవర్స్‌కు బదులుగా పేపర్ బ్యాగ్‌లో స్టోర్ చేస్తే.. ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
విడిగా ఉంచండి..
అరటిపండ్లను మిగిలిన పండ్లతో స్టోర్ చేస్తూ ఉంటారు. వీటిని యాపిల్స్, అంజీర్ వంటి పండ్ల దగ్గరగా పెడితే.. త్వరాగ పక్వానికి వచ్చేస్తాయి. ఈ పండ్లు ఇథలిన్ గ్యాస్ రిలీజ్ చేస్తాయి. దీంతో అరటిపండ్లు త్వరగా పండి నల్లగా మారతాయి. అరటిపండ్లను మిగిలిన పండ్లకు దూరంగా ఉంచండి. వీటిని హ్యాంగర్‌కు వేలాడదీసినా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
ప్లాస్టిక్ కవర్ చుట్టండి..
అరటిపండ్లను ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచాలనుకుంటే.. ప్లాస్టిక్ కవర్ సహాయపడుతుంది. అరటిపండ్ల కాండానికి.. ప్లాస్టిక్ కవర్‌ను చుట్టండి. ఇలా చేస్తే అరటిపండ్లు త్వరగా పాడవ్వవు. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.