Health with family : బిజీ లైఫ్‌లో కుటుంబంతో ప్రత్యేకంగా గడపాలంటే చాలామందికి టైం కుదరదు. దొరికిన కాస్త టైం కూడా ఏవో అత్యవసర పనులకు కేటాయిస్తుంటారు. నిజానికి కుటుంబంతో సమయం గడపడం వల్ల ఆరోగ్యం బాగుంటుందట. ఈ మధ్యకాలంలో నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఫ్యామిలీతో కాస్త సమయం గడపడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారట.సోషల్ మీడియా అనుబంధాల వల్ల ఒత్తిడి, అనారోగ్యాలు కొని తెచ్చుకోవడమే అవుతుంది .
ఈ మధ్యకాలంలో కుటుంబసభ్యులు కలిసి కూర్చుని మాట్లాడుకునే వారు అరుదుగా ఉంటున్నారు. మాట్లాడాలన్నా, చూసుకోవాలన్నా అన్నీ సెల్ ఫోన్ లోనే. దానివల్ల కూడా డిప్రెషన్, ఆందోళనకు గురౌతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీతో కాసేపు కూర్చుని మాట్లాడటం వల్ల కొత్త ఉత్సాహం వస్తుందట. కుటుంబంతో సమయం గడిపే పిల్లలు సైతం స్కూల్లో చాలా యాక్టివ్ గా ఉంటారట. కూర్చుని మాట్లాడుకునేటపుడు అసలు స్కూల్లో వాళ్లు ఏం నేర్చుకుంటున్నారో పేరెంట్స్‌కి తెలియడంతో పాటు.. పిల్లల పట్ల మీరు ఎంత శ్రద్ధగా ఉన్నారో పిల్లలకు అర్ధమవుతుంది.
ఫ్యామిలీ మెంబర్స్‌తో సమయం గడపడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా సమస్య వస్తే దానికి కుటుంబ సభ్యులు పరిష్కారం చూపిస్తారు. టీనేజ్ పిల్లలు ఉన్నట్లైతే వారు తీసుకునే కొన్నినిర్ణయాలపై పేరెంట్స్ సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా వారు ఒక్కోసారి ప్రమాదకరమైన దారిలో వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. ఎటువంటి సమస్యకైనా ఫ్యామిలీ మాత్రమే పరిష్కారం చూపగలదు అనే విషయం వారికి కూడా అర్ధం అవుతుంది. సమస్యల పరిష్కారానికి మార్గం చూపించడమే కాకుండా వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ నైపుణ్యాలను నేర్పుతుంది.