Allu Arjun – Trivikram : త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు వచ్చి భారీ విజయాలు సాధించాయి. ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ మూడు సినిమాలు హారిక హాసిని క్రియేషన్స్ లో నిర్మాత రాధాకృష్ణ నిర్మించారు. గత కొన్ని రోజులుగా ఈ ముగ్గురి కాంబోలో మరో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి అధికారిక అప్డేట్ ఇచ్చారు.
హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సారి వీరి కాంబోలో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. దీంతో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది అల్లుఅర్జున్ 22వ సినిమాగా తెరకెక్కనుంది.
త్రివిక్రమ్ మహేష్ తో సినిమా, అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఈ సినిమా ఉండొచ్చని సమాచారం. ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ కాంబోలో నాలుగోసారి హిట్ కి రెడీ అవుతున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు ఈ సారి కూడా సినిమా హిట్ అని ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది . సినిమా న్యూ అప్డేట్ ల కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .