Ravi Teja : ఎనర్జీకి మారు పేరు మాస్ మహరాజ్ రవితేజ అంటే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఐదు పదుల వయసు దాటినా ఇంకా యంగ్‌గానే కనిపిస్తున్న ఆయన.. తన యాటిట్యూడ్, థింకింగ్ ప్రాసెస్‌లోనూ యంగ్ అనిపించుకుంటూ ఉంటారు. అలాగే ఇతర హీరోల మాదిరి ఒక మూవీ చేశాక ఓ నెల లేదా రెండు నెలలు రెస్ట్ తీసుకునే అలవాటు ఆయనకు అస్సలు లేదు. ఒకేసారి రెండు మూడు సినిమాలు సెట్స్‌పై ఉంటాయి. కెరీర్ ప్రారంభం నుంచి అదే స్పీడ్ కంటిన్యూ చేస్తున్న రవితేజ.. అపజయాలకు కుంగిపోడు, విజయాలకు పొంగిపోడు. ఆ లక్షణమే ఆయన్ని ఈ ఏజ్‌లో కూడా అంతే ఎనర్జీగా ఉంచుతోంది. అయితే ఇతర సినిమాల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ కామెంట్ చేయని రవితేజ.. తాజాగా ‘సామజవరగమన’ చిత్రం గురించి ప్రత్యేకంగా (Ravi Teja tweet Samajavaragamana) ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నానని చెప్పడం ఆ మూవీ టీమ్‌కు కూడా బూస్టప్ ఇచ్చింది.
రవితేజ ట్వీట్ విషయానికొస్తే.. ‘ఒక సినిమా చూస్తూ విరగబడి నవ్వుకుని చాలా రోజులైంది. సామజవరగమన మూవీ చూస్తూ కంప్లీట్‌గా ఎంజాయ్ చేశాను. విపరీతమైన వినోదాన్ని పంచింది. శ్రీవిష్ణు తన పాత్రలో చాలా నేచురల్‌గా కనిపించాడు. నరేష్,
వెన్నెల కిషోర్ తమ కామెడీ టైమింగ్‌తో చించేశారు. నిర్మాతలకు నా అభినందనలు. ప్రత్యేకించి దర్శకుడు రామ్ అబ్బరాజు, ఆయనకు రచనా సహకారం అందించిన భాను భోగవరపు, నందు సావిరిగాన.. మీరు ఇంకా చాలా దూరం వెళ్లాలి’ అంటూ పోస్ట్ చేస్తూ @Reba_Monica, @AnilSunkara1, @RajeshDanda_, @AKentsOfficial, @HasyaMovies హ్యాష్‌ట్యాగ్స్‌ను జతచేశాడు. కాగా ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.