Bitter Taste In Mouth : అనేక సందర్భాల్లో చాలా మంది నోటిలో చేదు రుచి పరిస్ధితిని ఎదుర్కొని ఉంటారు. నోరంతా చేదుగా ఉండటం ఎందువల్లో అర్ధంకాక చాలామంది ఆశ్ఛర్యపోవటమే కాదు, భయాందోళనకు లోనవుతుంటారు. నోటిలో శాశ్వతంగా ఉండే ఈ తరహా రుచికి కొన్ని కారణాలు ఉన్నాయి.
నోటిలో చేదు రుచి ఎందుకంటే ;
1. నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవటం ; నోటిలో చేదు రుచికి అత్యంత సాధారణ కారణం నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం. నోటిలో బ్యాక్టీరియా, పాచి, ఇతర ఆహార కణాలు పేరుకుపోతాయి, ఫలితంగా నోటి రుచి చేదుగా ఉండటంతోపాటు దుర్వాసన వస్తుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు దంతాలను బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాస్ చేయడం , మౌత్ వాష్ ఉపయోగించడం వంటివి అనుసరించటం ద్వారా నోటిలో చేదు రుచిన పోగొట్టుకోవచ్చు.
2. నోరు పొడిబారటం ; నోటిలో తగినంత లాలాజలం ఉత్పత్తి జరగని సందర్భంలో నోరంతా చేదు రుచితోపాటు, లోహ రుచి అనుభూతి కలుగుతుంది. దీనినే జిరోస్టోమియా అని పిలుస్తారు. ఈ పరిస్థితి కొన్ని రకాల మందులు, నిర్జలీకరణం, కొన్ని జబ్బులకు చికిత్స పొందేవారిలో కనిపిస్తుంది. పుష్కలంగా నీరు త్రాగడం, లాలాజల-స్టిమ్యులేటింగ్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
3. యాసిడ్ రిఫ్లక్స్ ; కడుపులోని ఆమ్లం తిరిగి అన్నవాహికలోకి ప్రవహిస్తుంది. దీంతో నోటిలో చేదుగా, పుల్లని రుచి కలిగిస్తుంది. దీనినే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) గా పిలుస్తారు. ఆరోగ్యకరమైన ఆహారాన్నితీసుకోవటం ద్వారా ఈ పరిస్ధితిని నివారించవచ్చు.
4. సైనస్ ఇన్ఫెక్షన్లు ; సైనస్ ఇన్ ఫెక్షన్ ఉన్నవారిలో నోటి రుచిలో మార్పు వస్తుంది. అంతర్లీనంగా ఉన్న సైనస్ ఇన్‌ఫెక్షన్‌ను నాసికా డీకాంగెస్టెంట్స్, స్టీమ్ ఇన్‌హేలేషన్ లేదా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం వల్ల లక్షణాలను తగ్గించవచ్చు.