Reduce Back Pain : కార్యాలయాల్లో కుర్చీలో కూర్చుని ఎక్కువ సమయం గడిపేవారిలో స్థిరంగా కూర్చోవడం వల్ల శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వెన్నునొప్పి, కూర్చునే భంగిమ సరిగా లేకపోవడం వంటివి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఎక్కువసేపు కూర్చోవడం వెన్ను ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతుంది. దీని వల్ల దీర్ఘకాలిక నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది. కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు గడిపటం, ఒకేచోట కూర్చోవటం వంటి నిశ్చల జీవనశైలి వల్ల వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనిని తగ్గించుకోవాలంటే కొన్ని చర్యలు చేపట్టటం చాలా ముఖ్యం.
ఎక్కువ సమయం కూర్చోని ఉండేవారిలో వచ్చే వెన్నునొప్పిని తగ్గించే మార్గాలు ;
1. సరైన భంగిమలో కూర్చోవటం ; వీపుపై ఒత్తిడిని తగ్గించడానికి కూర్చొనే విషయంలో సరైన భంగిమను అనుసరించాలి. వీపును నిటారుగా ఉంచి, భుజాలు సడలించి, పాదాలను నేలపై ఉంచి కూర్చోవాలి. ముందుకు వంగడం లేదా ముందుకు సాగడం వంటివి చేయకూడదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. సహజ వెన్నెముక వక్రతకు అనుకూలంగా ఉండే ఎర్గోనామిక్ కుర్చీని ఉపయోగించటం మంచిది.
2. రోజువారిగా సాధారణ వ్యాయామాలు ; క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వెన్ను కండరాలు బలోపేతం అవుతాయి. వెన్నెముకను స్థిరీకరించడానికి , వంపులు లేకుండా ఉండటానికి కొన్ని వ్యాయామాలు తోడ్పడతాయి. ఈత, నడక వంటి తక్కువ ప్రభావం కలిగిన ఏరోబిక్ వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెన్నునొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
3. తరచుగా అటు ఇటు కదులుతూ ఉండటం ; కండరాలను సాగదీయడానికి , వీపు వెనుక భాగంలో ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి 30 నిమిషాలకు ఒక సారి కూర్చున్న భంగిమ నుండి పైకి లేచి కాసేపు అటు ఇటు నడవాలి. ఇలా చిన్న విరామం తీసుకోవటం వల్ల వెన్ను నొప్పుల నుండి ఉపసమనం పొందవచ్చు.