శాసనసభ ద్వారా పరిచయం అయిన ఇంద్రసేన హీరోగా, జై క్రిష్ మరో ప్రధాన పాత్రలో పూర్ణాస్ మీడియా సమర్పణలో నిఖిల్ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇంద్రజాలం’. బుధవారం ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం ఇంటర్నేషనల్ ఆర్టిట్రేషన్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఆర్. మాధవరావు కెమెరా స్విచ్ఛాన్ చేయడంతో సినిమా ప్రారంభమైంది.
అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హీరో ఇంద్రసేన మాట్లాడుతూ… నేను నటించిన శాసనసభ మూవీ గత డిసెంబర్‌లో విడుదలై నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో చూసిన నిఖిల్‌గారు ఈ చిత్రంలో నాకు అవకాశం కల్పించారు. మధ్యలో కొన్ని కథలు విన్నప్పటికీ మంచి కథతో నా రెండో సినిమా రూపొందనుండడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
డి.ఓ.పి.: అమర్ కుమార్, సంగీతం: ఎం.ఎం. కుమార్, ఎడిటర్: చంటి, ప్రొడక్షన్ కంట్రోలర్: భైరవ ఈశ్వర్, పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి, నిర్మాత, కో`ప్రొడ్యూసర్ పూర్ణ శైలజ, నిర్మాత`దర్శకత్వం: నిఖిల్ కె. బాల.