Ranbir Kapoor :టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ వంగ. అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ అని తీసి అక్కడ కూడా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలను ఓకే చేసుకుంటున్నాడు. ఇప్పుడు సందీప్ వంగ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సందీప్ వంగ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
రణబీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ తో ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు సందీప్ వంగ. ఈ సినిమాని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ నిర్మిస్తుంది. యానిమల్ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచారు. ఈ సినిమా ఫుల్ యాక్షన్ మూవీగా ఉండబోతుందని సమాచారం. ఇక యానిమల్ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ నేడు రిలీజ్ చేశారు. ఈ ప్రీ టీజర్ లో రణబీర్ గొడ్డలి పట్టుకొని శత్రువులను నరుకుతుండగా వెనకాల పంజాబీ సాంగ్ థీమ్ తో BGM ప్లే చేశారు. త్వరలో టీజర్ రిలీజ్ కానుందని ప్రకటించారు.