Morning healthy Drinks: ఉదయం పూట మన దినచర్య ఆరోగ్యకరంగా ఉండాలి . మార్నింగ్ రొటీన్ మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది . ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి . ముఖ్యంగా.. మలబద్ధకం, గ్యాస్ట్రిక్, డయాబెటిస్ వంటి అనేక సమస్యలను నివారించవచ్చు . ఉదయం పూట . మన ఆరోగ్యానికి మేలు చేసే ఆ పానీయాలు ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం.
మెంతుల వాటర్..
మెంతులలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మెంతులలో రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్‌తో పాటు.. విటమిన్ ఎ, బి6, సి, కె వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డయాబెటిక్ పేషెంట్స్, టైప్ – 2 డయాబెటిస్‌ను నివారించిడానికి మెంతులు నానబెట్టిన నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మెంతులలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఒక చెంచా మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి . ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగి, మెంతులు మింగేయండి. ఈ డ్రింక్ ఎసిడిటీకి చెక్ పెడుతుంది, కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది, పీరియడ్ క్రాంప్స్, అధిక బరువు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
కిస్‌మిస్ వాటర్..
ప్రస్తుత లైఫ్‌స్టైల్ కారణంగా ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య గ్యాస్ట్రిక్, ఎసిడిటీ. కొన్ని సార్లు గ్యాస్ట్రిక్ వల్ భయంకరమైన నొప్పి వస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని కిస్‌మిస్‌లను నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు తాగి, కిస్‌మిస్ నమిలి తినండి. కిస్‌మిస్‌లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సి-విటమిన్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయం పూట ఈ వాటర తాగితే.. హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుంది, రక్తహీనత తగ్గుతుంది, పైల్స్ సమస్య దూరం అవుతుంది, ఎముకల దృఢంగా మారతాయి