ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా, రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా నటించిన సినిమా హలో బేబీ. ఈ చిత్రంలో కావ్య కీర్తి సోలోగా నటించడం విశేషం.
ప్రముఖ హీరో ఆది సాయికుమార్ ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రైలర్ ను బట్టి చూస్తుంటే సోలో క్యారెక్టర్ తో ఒక సినిమా తీయడం చాలా మెచ్చుకోవలసిన విషయమని ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందినటువంటి ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుందని హ్యాకింగ్ పై తీస్తున్నటువంటి మొదటి చిత్రంగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు.
నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ.. ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ చిత్రంగా ఇప్పటికే పురస్కారనంది, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్, దాదా సాహెబ్ అవార్డులు ఈ సినిమాకి వచ్చాయని అన్నారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం కెమెరామెన్ రమణ, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి మరియు మా చిత్రంలో నటించినటువంటి హీరోయిన్ కావ్య కీర్తి వలన ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందని కొనియాడారు. ప్రత్యేకంగా మా డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషి మరువలేనిది చాలా మరువని సంఘటనలు ఈ షూటింగ్ దశలోని జరిగాయి అని చెప్పుకొచ్చారు.