Hair Mask : ముల్తానీ మట్టిని చాలా మంది ముఖానికి రాస్తుంటారు. అయితే, దీనిని జుట్టుకి రాయడం వల్ల కొన్ని సమస్యలు దూరమవుతాయి.
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ గురించి అందరికీ తెలిసిందే. దీనిని వాడడం వల్ల చర్మానికి పోషణ అంది చక్కగా మెరుస్తుంది. అయితే, దీనిని జుట్టుకి రాయడం వల్ల చాలా జుట్టు సమస్యలు దూరమవుతాయి.
జిడ్డుకి..
ఆయిల్ స్కాల్ఫ్ ఉన్నవారికి ముల్తానీ మట్టి బెస్ట్ సొల్యూషన్. మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. మురికి, నూనెని దూరం చేస్తుంది. అయితే, డ్రై హెయిర్ ఉన్నవారు దీనిని వాడకపోవడం మంచిది. దీనివల్ల స్కాల్ఫ్ మరింత పొడిగా మారుతుంది.
బెస్ట్ హెయిర్ ప్యాక్..
జుట్టు దురద పెడితే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చెయ్యండి
స్కాల్ఫ్‌ని హైడ్రేట్ చేయడం..
ముల్తానీ మట్టిని స్కాల్ఫ్‌పై హైడ్రేట్ చేయడం వల్ల హైడ్రేషన్ అందుతుంది. ఇది మన స్కాల్ఫ్ నుండి సహజ నూనెల స్రావాన్ని తగ్గించి.. బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. దీంతో చుండ్రు తగ్గుతుంది.
మాయిశ్చరైజర్..
ముల్తానీ మట్టి తేమని నిలపుకుంటుంది. దీనిలో కొన్ని పదార్థాలు కలపడం వల్ల మీ జుట్టు సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి.
స్ప్లిట్స్ కోసం..
చాలా మందికి జుట్టు చివర్లు గరుగ్గా మారి చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల జుట్టు సరిగ్గా పెరగదు. కాబట్టి, దీనిని రిపేర్ చేసేందుకు జుట్టుని సిల్కీగా మారుతుంది.
దుమ్ముని తొలగించడం..
జుట్టుని రాలడానికి కారణాల్లో ఒకటి దుమ్ము, ధూళి. అందుకే ముల్తానీ మట్టిని అప్లై చేయడం వల్ల దుమ్ము, ధూళి దూరమవుతుంది. అదే విధంగా స్కాల్ఫ్‌పై ఉన్న రంధ్రాలు కూడా క్లీన్ అవుతాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది.