Madhavi Latha: టాలీవుడ్‌లో నచ్చావులే చిత్రంతో సక్సెస్ కొట్టిన హీరోయిన్ మాధవీ లత, స్నేహితుడా, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె క్రమంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటుంది. మనసంతా కృష్ణ తత్వాన్ని వ్యాప్తి చేయటంపైనే మనసు లగ్నం చేశానని ఆమె అంటున్నారు మరి.
ఇధి ఇలా వుండగా ఆమెను ఓ ప్రశ్న పదే పదే ఇబ్బంది పెట్టింది.. ఇంతకీ ఆ ప్రశ్నేంటో తెలుసా!.. పెళ్లెప్పుడు?. సాధారణంగా ఓ ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటారు. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడీ స్పీడ్ యుగంలో కెరీర్‌లో సెటిలైన తర్వాతనో.. బాగా డబ్బులు సంపాదించిన తర్వాతనో .. అదీ ఇదనే కారణాలతో పెళ్లి అనేది యువత తొందరపడటం లేదు.
అయితే అమ్మాయిల విషయంలో మాత్రం పెళ్లి ప్రస్తావన విషయం కామన్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అలాంటి ప్రశ్నే మాధవీలతను ఇబ్బంది పెట్టింది. పదే పదే అడుగుతున్నారో.. ఇబ్బంది పెడుతున్నారో తెలియదు కానీ, అమ్మడు మాత్రం తెగ ఇరిటేట్ అయ్యింది. దీంతో తన సోషల్ మీడియా ద్వారా ఆ ప్రశ్నను అడిగిన వారందరికీ సమాధానం ఇచ్చింది. ‘‘ప్రియమైన సమాజం.. ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒకటే సరిపోదు. ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవటం అనేది ఆమె నిర్ణయం’’ అని పేర్కొంది మాధవీ లత. కాబట్టి నేను వాటికి సిద్ధంగా లేను .. అన్నిటికీ సిద్దపడినప్పుడు కచ్చితం గా మీతో పంచుకుంటా అంటూ చెప్పుకొచ్చింది ..