ప్రపంచ యోగా గురువు రాందేవ్ బాబా గారితో నేడు మర్యాదపూర్వకంగా హరిద్వార్ నందు కలిసి ఆశీర్వాదములు తీసుకున్న డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి గారు.
ముందుగా ఆయనతో పాటు ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇరువురి మధ్య ఆధ్యాత్మికత గురించి , భారత దేశ సాంస్కృతి , సాంప్రదాయాల గురించి విస్తృతముగా చర్చ జరిగింది. ప్రపంచంలో పెరుగుతున్న యోగా ప్రాముఖ్యత గురుంచి , భారత దేశ ప్రాచీన , ప్రఖ్యాత వైద్య మైన ఆయుర్వేదం గురించి విస్తృతంగా చర్చించు కున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల గురించి వాటి నివారణ గురించి సుదీర్ఘముగా చర్చించడం జరిగింది.
ఈ సందర్బంగా పతాంజలి సంస్థ ద్వారా కొన్ని వేల ఎకరాలలో బాబా రాందేవ్ గారు స్థాపించిన నేచురోపతి , ఆయుర్వేద కాలేజీలు సందర్శించి , అక్కడి చికిత్సాలయాల గురించి , అక్కడ అవలంబింప బడ్తున్న రోగ నిరోధక పద్ధతుల గురించి చర్చించుకున్నారు !
ఆంధ్ర రాష్ట్రంలోని ఎంతో వెనుక బాటు కు గురైన గ్రేటర్ రాయలసీమలో ఇటువంటి పతాంజలి సంస్థను స్థాపించాలని రాందేవ్ బాబా గారిని గౌతమ్ నాగి రెడ్డి గారు కోరటం జరిగింది . దానికి రాందేవ్ బాబా గారు సానుకూలంగా స్పందించి త్వరలో ఇది కార్యరూపం దాల్చే విధంగా తన బృందాన్ని పంపిస్తానని తెలియజేసారు.
పతాంజలి సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించడానికి అవసరమైన భూమిని దాతల ద్వారా సేకరించి దాని నిర్మాణానికి, నిర్వహణకు అయ్యే ఖర్చును ఆ సంస్థకు డొనేషన్ ద్వారా సేకరించడానికి కృషి చేస్తానని బాబా రాందేవ్ గారికి తెలియజేయడం జరిగింది . ఆ ప్రయత్నం కొంతవరకు సఫలీకృతమైనదని గౌతమ్ నాగి రెడ్డి గారు తెలియజేసారు !!
తనవంతుగా వ్యక్తిగతంగా నిధులు సమకూరుస్తానని తెలియజేసారు.
ఇరువురు సమకాలీన మరియు ప్రాచీన సాంప్రదాయాల గురించి మాట్లాడుకోవడంతో పాటు ఈ సమాజాన్ని మార్చే యోగా , ధ్యానం , ఆధ్యాత్మికత ప్రస్తుత జనరేషన్ పిల్లల్లో పెంపొందించాలని, భావి భారత పౌరుల్లో భారతీయత చాటిచెప్పేలా తోడ్పాటు అందజేయాలని చర్చించుకున్నారు !!
పతాంజలి సంస్థ ద్వారా ఎంతో ఉన్నతమైన, విస్తృతమైన సేవలు అందిస్తున్న రాందేవ్ గారు చిరస్మరణీయులు అని గౌతమ్ నాగి రెడ్డి గారు తెలియ జేశారు !