Black Beans : బీన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ బీన్స్ కూడా. ఇవి మిగతా బీన్స్ కంటే తక్కువ ధరలోనే మనకి లభిస్తాయి. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకోండి.
బ్లాక్ బీన్స్.. మిగతా బీన్స్ కంటే తక్కువ ధరలో దొరుకుతాయి. కానీ, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఏమేం లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పేగు ఆరోగ్యం..
బ్లాక్ బీన్స్‌లో కార్బోహైడ్రేట్స్ రెసిస్టెంట్ స్టార్చ్‌గా లభిస్తాయి. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి. ప్రేగులని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రేగుల్లోని బ్యాక్టీరియాని బయటికి పంపేలా చూస్తాయి.
షుగర్ కంట్రోల్..
చికెన్, చేపల్లో ఎక్కువగా లభించే ప్రోటీన్ ఈ బ్లాక్ బీన్స్‌లో కూడా ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాంటి అప్పుడు ఆరోగ్యం మన చేతిలో వున్నట్టే
గుండె ఆరోగ్యం..
బ్లాక్ బీన్స్‌లోని డైటరీ ఫైబర్ బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మొక్క ఆధారిత ప్రోటీన్ అయిన ఈ బీన్స్‌లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.
బరువు తగ్గించేందుకు..
బ్లాక్ బీన్స్‌లో అధిక మొత్తంలో ఉండే డైటరీ ఫైబర్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్‌నిస్తుంది. దీంతో ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుంది. బరువు తగ్గేలా చేస్తుంది.ఇంకా బరువు పెరగడం కూడా ఆగిపోతుంది .