Akhil Akkineni – Ram Charan : అక్కినేని యంగ్ హీరో అఖిల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. రీసెంట్‌గా రిలీజైన ‘ఏజెంట్’ మూవీకి అఖిల్ విపరీతంగా కష్టపడ్డాడు. అయినా ఫలితం తేడా కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్ మూవీ కోసం సిద్ధమవుతుండగా.. ఈసారి అఖిల్ కోసం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ (Agent) మూవీ హీరో అఖిల్ అక్కినేనికి (Akhil Akkineni) తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా పడ్డ కష్టమంతా వృథా అయింది. దీంతో రీఫ్రెష్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్న అఖిల్.. రెట్టించిన ఉత్సాహంతో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ మేరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే, ఇదే క్రమంలో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్.. అఖిల్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది. అయితే ఇదేదో మల్టిస్టారర్ అని పొరబడకండి. ఈ సినిమాకు చరణ్ నిర్మాతగా (Ram Charan as Producer) వ్యవహరించనున్నాడు.
రామ్ చరణ్ తన ఫ్రెండ్ విక్రమ్‌తో (Vikram) కలిసి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. ‘వి మెగా పిక్చర్స్’ (V Mega Pictures) అని పేరు కూడా అనౌన్స్ చేశాడు. ఈ బ్యానర్‌పై విక్రమ్, చరణ్ కలిసి యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంతో పాటు పాన్ ఇండియా మూవీస్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు ఫిలిం డిస్ట్రిబ్యూషన్ వంటి ఇతర వెంచర్లలోనూ భాగస్వామ్యం కావాలని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ మొదటి ప్రాజెక్ట్‌గా అఖిల్‌తో సినిమా చేయనున్నారని సమాచారం. వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని తెలిసిందే కాగా.. ఈ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.