Summer skin care: ఎండలు మండిపోతున్నాయ్.. ఈ మండే ఎండలకి మన చర్మం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఎండ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మంపై చెమట పొక్కులు, మొహం నల్లగా మారడం, ఎర్ర మచ్చలు, జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి అధిక సంరక్షణ అవసరం. ఈ సీజన్‌లో మన హెల్త్ అండ్ బ్యూటీ కేర్ రొటీన్‌లో కొన్ని పదార్థాలు చేర్చుకుంటే.. ఈ సమస్యని ఈసీ గా తొలగిచ్చుకోవచ్చు .
చందనం ..
చందనం మన సౌందర్య సంరక్షణలో ఎంతగానో సహాయపడుతుంది. గంధంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్, యాంటీప్రొలిఫెరేటివ్, గుణాలు సమృద్ధిగా ఉంటాయి. . ఇవి చర్మానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. .గంధం చర్మంలో పేరుకున్న మలినాలు తొలగిస్తుంది.
కీరా..
వేసవిలో మీ చర్మాన్ని తేమగా, హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఉత్తమమైన మార్గం కీరా. కీరాను మీ ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత.. చర్మంపై టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కళ్లు ఉబ్బు, డార్క్ సర్కిల్స్ ఉంటే.. వారానికి రెండుసార్లు కీరా ముక్కలను కంటి మీద 15 నిమిషాల పాటు ఉంచుకోండి.
పెరుగు..
వంటిలో వేడి తగ్గించడానికి పెరుగు తినడం ఎంతో మంచిది . పెరుగులో ఉండే కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి 6, విటమిన్ బి 12,ఏ, డి వంటి పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై పేరుకున్న డెడ్ సెల్స్ తొలగిస్తుంది. ముడతలు, వృద్ధాప్య ఛాయలను మాయం చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. వడదెబ్బ నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. వేసవిలో మీ స్కిన్‌కేర్ రొటీన్‌లో పెరుగును తప్పకుండా చేర్చుకోండి.