Ray Stevenson: RRR నటుడు రే స్టీవెన్ సన్ హఠాన్మరణం చెందారు. సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది . అయితే ఆయన ఎందుకు చనిపోయారనే దానికి కారణాలు మాత్రం తెలియటం లేదు. బ్రిటీష్ జనరల్ స్టీవ్ బక్ స్టన్స్ పాత్రలో ఆయన తనదైన నటనతో మెప్పించారు.ఆ పాత్రకి ఆయన పూర్తి న్యాయం చేశారు అనే ప్రశంశలు అందుకున్నారు.
వీరు RRR చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించి మెప్పించిన ఐరిష్ నటుడు స్టీవెన్ సన్ హఠాన్మరణం చెందడం ఎంతో భాదాకరం . ఈ విషయాన్ని ఆయన పి.ఆర్ తెలియజేశారు. ఆయన ఎందుకు చనిపోయారనే దానికి కారణాలు తెలియటం లేదు. స్టీవెన్ సన్ చనిపోయారనే విషయం తెలిసిన సినీ ప్రపంచం షాక్ అయ్యింది. తోటి నటీనటులు ఆయనకు నివాళులు అర్పించారు. RRR టీమ్ సైతం తన బాధను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ‘మీరు చనిపోయారనే వార్త మమ్మల్ని షాక్‌కి గురిచేసింది. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం’ అని విచారాన్ని వ్యక్తం చేసింది RRR టీమ్
1990లలో టీవీ షోలలో తన కెరీర్‌ను స్టార్ చేశారు స్టీవెన్ సన్. 2000 సంవత్సరం నుండి హాలీవుడ్ చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. అక్కడ తనదైన నటనతో మెప్పించి గుర్తింపును దక్కించుకున్నారు.. ఆంటోయిన్ ఫుక్వా 2004 అడ్వెంచర్ మూవీ ‘కింగ్ ఆర్థర్’ స్టీవెన్ మొదటి ప్రధాన చలన చిత్రం. అలాగే ‘నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్’లోనూ ఒకటైన డాగోనెట్‌గా కనిపించారాయన. స్టీవెన్ సన్ అకాల మరణంపై ఆయన అభిమానులు, సన్నిహితులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కారణాలు త్వరగా తెలుసుకోవాలని కోరారు సినీ నటులు .