మసూద విజయంతో దూసుకుపోతున్న యంగ్ హీరో తిరువీర్ పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్లో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాల్తేర్ ప్రొడక్షన్స్ పై విశ్వతేజ్ రాచకొండ, సిద్దార్థ్ రాళ్ళపల్లి నిర్మించారు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా రావడంతో పెద్ద బ్యాకింగ్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది.
జూన్ 2న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారంనాడు హైదరాబాద్‌లోని పివిఆర్ సినీ మ్యాక్స్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్, సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్, వాల్తేర్ ప్రొడక్షన్స్ అధినేతలు విశ్వతేజ్ రాచకొండ, సిద్దార్థ్ రాళ్ళపల్లి, నటీనటులు పావని కరణం, మురళీ, తిరువీర్, రానా దగ్గుబాటి, సినిమాటోగ్రాఫర్ వాసు పందెం, గీతరచయిత అఖిల్ చంద్రమౌళి హాజరయ్యారు.
హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ… ఈ యంగ్ టీమ్ అంతా ప్రేమించి ప్యూర్ ఎనర్జీతో సినిమా తీశారు. అది సినిమాలో కనిపిస్తుంది. నేను మొదటిసారి చూసినప్పుడు నాకూ నవ్వి నవ్వి.. దవడలు నొప్పి పెట్టాయి. నాకు తెలిసి హైదరాబాద్ వచ్చాక ఈ ఫంక్షన్ జరుగుతున్న ప్రాంతమంతా తారురోడ్డుతోనే వుండేది. ఈ చుట్టుపక్కలవున్న ప్రపంచమే నా లోకం. అలాంటిది మీ టీమ్‌లో నేను చూశాను.
ఇక తిరువీర్ నాతో ఘాజి సినిమాలో సబ్‌మెరైన్‌లో పని చేశాడు. తను మంచి ఆర్టిస్టు. తెలంగాణ ఫామ్‌మేషన్ డే జూన్ 2న ఈ సినిమా విడుదలకాబోతుంది. నిర్మాత విశ్వ నేను ఎక్కడున్నా పరేషాన్ చేస్తూ సార్. ట్రైలర్ చూడండి.. అంటూ చూపించేవాడు. చూశాక. నేను ఇందులో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.