bindhu madhavi:బిగ్గ్ బాస్ ఫేమస్ అయిన బింధు మాధవి ,మన తెలుగు హీరోయినే,అయితే ఈమె అవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్, రామ రామ కృష్ణ కృష్ణ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతే చెన్నై చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వెళ్లి ఫైనలిస్ట్‌గా నిలిచింది. అయితే తెలుగు ఓటీటీ బిగ్ బాస్‌లో అఖిల్ సార్ధక్‌ని మట్టికరిపించి.. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో టైటిల్ గెలుచుకున్న తొలి మహిళా కంటెస్టెంట్‌గా సత్తా చూపించింది.
Bindu Madhavi Boyfriend: ఆడపులిలా బిగ్ బాస్ ఆట ఆడి.. అఖిల్‌ని ఆడ ఆడ అంటూ రక్తకన్నీరు చూపించి బిగ్ బాస్ ఓటీటీ టైటిల్‌ను అందుకున్న బిందు మాధవి.. బిగ్ బాస్ తరువాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. వరుస వెబ్ సిరీస్‌లతో సత్తా చూపిస్తున్న ఈ మదనపల్లి బ్యూటీ.. తాజాగా ‘న్యూసెన్స్’ (newsense movie heroine) అనే చిత్రంలో నటించింది. మే 12 ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలైన ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. హీరో నవదీప్, హీరోయిన్ బింధు మాధవిలపై ఇప్పటివరకూ వార్తల్లో వచ్చిన గాసిప్‌లను ఒక్కొక్కటిగా చదువుతూ.. నిజమా? కాదా? అని అడిగింది. నవదీప్‌కి సంబంధించిన గాసిప్‌ల లిస్ట్ చాలానే ఉండటంతో.. ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ తప్ప.. తనపై వచ్చినవన్నీ రూమర్లే అనేశారు. నిజానికి యాంకర్ అడిగిన ప్రశ్నలు కూడా స్క్రిప్టెడ్‌లానే అనిపించాయి. అవన్నీ నిజం కాదని చెప్పుకోవడానికి నవదీప్.. యాంకర్‌తో ఆ ప్రశ్నలు అడిగించినట్టు టాక్ . ఏదయినప్పటికి హీరోయిన్ బిందు ఆ ఇంటర్వ్యూ సమాధానాల ప్రభావాన తాజాగా నటించిన సిరీస్ హిట్ కొట్టేసింది .