allu arjun :’పుష్ప 2 ‘ షూటింగ్ లో ఫుల్ బిజీ గా వున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ . అయితే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి నెట్టింట అనేక రూమర్స్ స్ప్రెడ్ అవుతుండగా.. ‘రేసుగుర్రం’ డైరెక్టర్ సురేందర్ రెడ్డిపేరు వినిపించింది. అయితే అల్లు అర్జున్ ,సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీఅయిన ‘ రేసుగుర్రం’ సూపర్ సక్సెస్ ని తెచ్చింది .కానీ ఎందుకో అల్లు అర్జున్ వెనక్కి తగ్గినట్టు వార్తలు వినబడుతున్నాయి .
రేసు గుర్రం హిట్ తో ఈ కాంబినేషన్‌కు క్రేజ్ ఏర్పడింది. వీళ్లిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన రీసెంట్ మూవీ ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో వారి ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి. ఈ ప్రభావం సురేందర్ రెడ్డిపైనా పడనుంది.
‘పుష్ప’ మూవీ తర్వాత బన్నీ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు అనుభవిస్తున్న పాన్-ఇండియా ఇమేజ్‌ను రిస్క్‌లో పెట్టే ఉద్దేశ్యం తనకు లేదు. పైగా ‘అలా వైకుంఠపురములో, పుష్ప’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్ట్ చేయడంతో ‘పుష్ప 2’ కోసం కూడా భారీ బజ్ ఉంది. ఈ లెక్కన గోల్డెన్ హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రాబోయే 4-5 ఏళ్ల కోసం బన్నీ తన లైనప్‌ను లాక్ చేసేశాడు. ఇవన్నీ లెక్కేసుకుంటే ‘ఏజెంట్’ ఫ్లాప్ తర్వాత సురేందర్ రెడ్డికి బన్నీ చాన్స్ ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది.
‘ఏజెంట్’ విషయంలో సురేందర్ పూర్తి స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టారు అని టాక్ ,కాబట్టే ఫ్లాప్ చూడాల్సి వచ్చింది అంటుంన్నారు . ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. రీసెంట్‌గా ‘పుష్ప2’ నుంచి విడుదలైన టీజర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఫస్ట్ పార్ట్ కంటే మరింత ఆసక్తికరంగా పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారనే విషయం స్పష్టమైంది. కాగా.. ‘పుష్ప2’ రిలీజైన తర్వాత బన్నీ క్రేజ్ ఇంకా ఏ రేంజ్‌కు వెళ్తుందో ఊహించడం కష్టమే.