Varun Tej : తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి అంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాగా మెగాస్టార్ చిరంజీవి మొదలు కొని వైష్ణవ్ తేజ్ వరకు తమ తమ శైలిలో రాణిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకొని కష్టే ఫలి అనే నానుడితో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగ ఫ్యామిలిలో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయనే సమాచారం అందుతుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. ముకుంద మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.
కంటెంట్ బేస్డ్ చిత్రాలను చేసుకుంటూ పోతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లవ్‌లో ఉన్నారని కొంతకాలంగా మీడియాలో వార్తలు వెలువడతున్నాయి. కానీ తాము మంచి స్నేహితులం మాత్రమేనని ఈ జంట స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ .. ఇప్పటికీ వాళ్లిద్దరి రిలేషన్‌షిప్ లో వున్నారు అనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా నిహారిక పెళ్లి వేడుకకు లావణ్య హాజరవడం పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. ఇదే క్రమంలో వరుణ్, లావణ్యల నిశ్చితార్థం వచ్చే నెలలో జరగనుందని బాలీవుడ్ మీడియాలో తాజాగా వార్తలు వెలువడ్డాయి. ఎంగేజ్‌మెంట్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తుండగా.. ఈ జంట ఇదే ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నారని.. త్వరలోనే శుభవార్త వెలువడుతుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక వరుణ్, లావణ్యల ప్రేమ విషయానికొస్తే.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్’ షూటింగ్ టైమ్‌లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా తమ రిలేషన్‌షిప్‌ను బయటపెట్టలేదు.