break fast:బ్రేక్‌ఫాస్ట్ అనగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లీనే.ఇడ్లీ అనగానే గుర్తొచ్చేది మృధుత్వం ,ఇడ్లీలు మృధువుగ ఉంటే ఎన్ని అయిన తినాలిఅనిపిస్తుంది . వేడివేడి ఇడ్లీలు తిన్నప్పుడు ఉండే మజానే వేరు. ఆరోగ్యానికి మంచిదని తేలికగా అవుతుందని అమ్మలంతా వారంలో మూడు నాలుగు రోజులు ఇడ్లీనే చేస్తూ ఉంటారు.అస్సలు బోర్ కొట్టని బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ ఒక్కటే . అయితే వేసవి కాలంలో ఇడ్లీ పిండి త్వరగా పులుస్తుంది. ఈ పిండితో తయారు చేసిన ఇడ్లీలు.తిన్నడానికి అంతగా రుచిగా ఉండవు,పుల్లగా అనిపిస్తాయి , ఈసమ్మర్ సీజన్‌లో ఫ్రిజ్‌లో పెట్టినా పిండి పులుస్తూ ఉంటుంది. దోశల పిండి పరిస్థితి కూడా ఇదే. కొన్ని టిప్స్ ఫాలో అయితే.. ఇడ్లీ పిండి, దోశ పిండి బయట పెట్టినా పులువకుండా ఉంటాయి.
బియ్యాన్ని కానీ పప్పులు గాని మూడు నాలుగు గంటలు మాత్రమే నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పిండి రుబ్బడం వల్ల త్వరగా పులిసిపోతుంది
ఇడ్లీ, దోశల పిండిని మిక్స్ చేసేటప్పుడు.. గరిటతోనే కలుపుకోవాలి, చేతితో కలిపితే , పిండి త్వరగా పులిసిపోయే అవకాశం ఉంది.
మీరు పప్పు పట్టేప్పుడు గ్రైండర్‌ను శుభ్రంగా కడగాలి. గ్రైండర్లో మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా రుబ్బుకోవాలి. అవన్నీ కిలిపి ఎప్పుడు మెత్తగా రుబ్బకూడదు.
ఇడ్లీలు పులిసిన వాసన రాకుండా రుచిగా ఉండాలంటే.. పిండి రుబ్బేటప్పుడు మూడు చెంచాల నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తే మంచిది .
పిండిని పెద్ద పాత్రలో నీళ్లతో పోసి దాని పైన పిండి పాత్రను ఉంచితే అది త్వరగా పులియదు.
ఇడ్లీ పిండిపై అరటి ఆకు ముక్కలు వేసి మూత పెడితే ఆ పిండి రెండు రోజులపాటు కూడా అలాగే ఉంటుంది.
ఇడ్లీ పిండి ఎక్కువ రోజులు పులియకుండా ఉండాలంటే 100 గ్రాముల ఇడ్లీ పిండికి 1 మి.లీ ఆవాలనూనె కలిపండి. ఇలా చేస్తే,పిండి బయట ఉంచినా పులియదు. ఫ్రిజ్‌లో ఉంచితే 30 రోజుల వరకు చెడిపోదు. ఆవాల నూనె ఇడ్లీ పిండిలో ఉత్పత్తి అయ్యే చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.