potato face pack :ఎప్పుడు మెరిసే, ముడతలు లేని చర్మం కావాలని ప్రతి అమ్మాయి లో వుండే సాధారణ కోరిక కానీ, అనేక కారణాల వల్ల చర్మ సమస్యలు వస్తాయి. వాటి నుండి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు పెరుగుతాయి. అలాంటప్పుడు ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించడం మంచిది . అవేంటో తెలుసుకోండి. చర్మ సమస్యలకి ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. సహజంగానే తయారు చేస్తాం కాబట్టి చర్మానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు . మరి అలాంటి చిట్కాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
బియ్యం పిండి, బంగాళాదుంప ప్యాక్..
ఈ ప్యాక్ తయారు చేసేందుకు మీకు కావాల్సింది బియ్యం పిండి, పాలు, బంగాళా దుంపలు. కొన్ని పాలల్లో బియ్యం పిండి ని కలిపి పక్కన పెట్టాలి . అంతకంటే ముందు ఒక బంగాళాదుంప ని మెత్తగా మిక్సీ పట్టి ,ఆ మిశ్రమాన్ని పాలు బియ్యంపిండి కలిపిపెట్టిన మిశ్రమం లో కలిపి , ఫేస్ కి అప్లై చేసి కాసేపు ఆగక కడిగేస్తే చాలు .
బంగాళాదుంపలు ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్‌ని కలిగి ఉంటాయి. ఇందులోని బ్లీచింగ్ గుణాలు ముఖాన్ని కాంతివంతంగా తయారు చేసి చర్మంపై ముడతల్ని దూరం చేస్తుంది.
హెల్దీ, మెరిసే చర్మాన్ని పొందేందుకు మీకు ఈ బంగాళాదుంప ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల నల్ల మచ్చలు దూరమవుతాయి.
పాలలో గుణాలు..
పాలలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉంటాయి. వీటి వల్ల అందంగా తయారవుతారు. దీంతో చర్మం మెరుస్తూ, అందంగా మారేలా చేస్తుంది. ప్రతి రోజూ ముఖంపై పచ్చిపాలని అప్లై చేస్తే కాంతి వంతమైన, మృదువైన చర్మం మీ సొంతమవుతుంది .