Health Tips : ప్రస్తుత కాలంలో మహిళలు ఎక్కువగా ఇష్టపడేది జుట్టు. జుట్టు బలంగా.. ఒత్తుగా వుండాలి అంటే ముఖ్యంగా చేయాల్సిన పనులు రెండు. అందులో ఒకటి జుట్టుకు ఆయిల్ పెట్టుకోవడం.. రెండోవది వారానికి రెండు సార్లు తల స్నానం చేయడం. ముందుగా మొదటి దాని విషయానికి వస్తే జుట్టుకి ఆయిల్ పెట్టడం ఎంతో లాభకారం, జుట్టుకి ఆయిల్ ఇచ్చే బలం అంత ఇంత కాదు.
ఆయిల్ రాయడం వల్ల జుట్టు పొడుగ్గా, ఆరోగ్యంగా పెరుగుతుంటుంది. దీంతో మార్కెట్లోనూ చాలా ఆయిల్స్ పుట్టుకొచ్చేశాయి. అదే విధంగా, ప్రతి కంపెనీ కూడా కొత్తకొత్తగా వాటి ఆయిల్స్‌ని ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇందులో ఏం నమ్మాలో తెలియదు, ఇక అందులోనూ మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. ఆ చిన్న చిన్న తప్పుల వల్ల జుట్టు ధాని పటుత్వాన్ని కోల్పోతుంది . వాటి గురించి కూడా ఎక్కువగా పట్టించుకోము ,దీంతో సమస్య మరింత ఎక్కువ అవుతుంది. మరి ఆ సమస్యలు ఏంటి..వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోండి.
జుట్టుకి నూనె రాస్తే..
రోజూ జుట్టుకి నూనె రాస్తే జుట్టు బాగా పెరుగుతుందని కొందరు అంటే.. కొంతమంది దానికి దీనికి సంబంధం లేదని అంటున్నారు. అయితే, నూనెతో మసాజ్ చేస్తే రక్త ప్రసరణ పెరిగి జుట్టు పెరుగుతుందన్నది చాలా మంది వాదన. జుట్టు ఎప్పుడయినా నల్లగా, ఒత్తుగా వుండాలి అంటే కచ్చితంగా ఆయిల్ వాడాలి.
లాభాలేంటి..
జుట్టుకి నూనె రాస్తే.. జుట్టు రిలాక్స్‌గా ఫీల్ అవుతుంది. శరీరానికి, మనసుకి రెస్ట్‌ని ఇచ్చిన వాళ్ళవుతాం. నూనె వేడి చేసి జుట్టుకి మృదువుగా అప్లై చేయండి. దీని వల్ల తలకి రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టుని పెంచే ఫోలికల్స్ ప్రేరేపితమవుతాయి. కొబ్బరి నూనెతో పాటు ఆముదం కలిపి తలకి రాస్తే జుట్టు స్పీడ్‌గా పెరుగుతుంది. నల్లగా న్యాచురల్ గా కూడా అనిపిస్తుంది.