Entertainment స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్ల నుంచి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం తలకిందులు అయ్యింది. అలాగే విడాకుల అనంతరం తనపై వచ్చిన సోషల్ మీడియా ట్రౌలింగ్స్ తో మానసికంగా కృంగిపోయారు. ఈ విషయాల నుంచి బయటపడుతున్న సమయంలోనే మయోసైటిస్ వ్యాధి తనపై దాడి చేసి శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికీ ఎంతో ధైర్యంగా ఉంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్స్ ను కలిగిస్తూ వస్తున్నారు..
స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలం నుంచి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి విదేశాలు సైతం వెళ్లారు అలాగే ఈ మధ్య పలు దేవాలయాలు తిరుగుతూ తన ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు అలాగే ప్రత్యేకంగా సినిమాలు అంటూ ఏవి ఒప్పుకోకుండా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో సమంత ఒక పోస్ట్ ను ఉంచారు ఇందులో ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మనకు తెలియదు అందుకే అందరి మీద జాలి చూపించండి అంటూ చెప్పుకొచ్చారు నిజానికి ఈ పోస్టులో ఎంతో అర్థం కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో బాధలు ఉంటాయి అవన్నీ బయటకు కనిపించవు కేవలం నవ్వుతూ సంతోషంగా మాత్రమే తిరుగుతూ ఉంటారు కానీ వాటిని అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు అపార్థం చేసుకోవద్దు అందుకే ప్రతి ఒక్కరి మీద జాలి చూపించండి అంటూ చెప్పుకొచ్చారు ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.