Entertainment ఆరాధ్య క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను తమిళ స్టార్ హీరో సూర్య కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి..
సినీ, రాజకీయ ప్రముఖులందరూ క్రికెటర్లతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్న మాట ఎన్నాళ్ళ నుంచి ఉన్నది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు క్రికెటర్లతో ఎన్నాళ్ళ నుంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత తమిళ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ హీరోలు సైతం క్రికెటర్లతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, వెంకటేష్ వంటి వారు సినీ క్రికెటర్లతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదే కోవలో చేరారు తమిళ స్టార్ సూర్య..
హీరో సూర్య తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్. అయితే విషయం ఏంటి అనేది మాత్రం చెప్పలేదు.. కానీ వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి. ఇద్దరు స్టార్లను ఒకే వేదికపై చూసిన అభిమానులందరూ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా విషయం ఏమై ఉంటుందంటూ ఆరా తీస్తున్నారు. అయితే సూర్యకు సచిన్ అంటే ఎన్నాళ్లు నుంచో అభిమానం అని అందుకే అతని కలిసి ఉంటారు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.. ఏది ఏమైనా సూర్యసచిన్ను కలవడం అభిమానులకు మంచి క్రేజీ ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఫోటోలను పంచుకున్న సూర్య కిందన రెస్పెక్ట్ లవ్ అంటూ ట్యాగ్ కూడా చేశారు..