Entertainment జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షో లతో మంచి పేరు సంపాదించుకున్న నటి ఐశ్వర్య మొదటగా మోడల్గా చేస్తూ ఆ తర్వాత ఈ షోలలో నటించారు అలాగే ఇప్పుడు సినిమాల్లో సైతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వస్తున్నారు అయితే తాజాగా ఈమె పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు..
ఐశ్వర్య తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు అలాగే.. “టాలీవుడ్ స్టార్స్‌లో నేను అభిమానించే వ్యక్తి పవన్‌కల్యాణ్. ఆయన్ను కలిసే అవకాశాలు చాలా వచ్చినా ఎప్పుడూ కలవలేకపోయా. నటిగా గుర్తింపు తెచ్చుకుని నువ్వు ఫలానా కదా అని గుర్తించాక ఆయన్ను కలవాలని నా కోరిక.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజు నుంచీ పవన్‌కల్యాణ్ సినిమాలో కనిపించాలని నా ఆశ. కానీ ఒక కండీషన్. పవన్‌కల్యాణ్‌గారి సినిమాలో పని మనిషిగా చిన్న పాత్ర అయినా చేస్తాను కానీ ఆయనకు అక్కా చెల్లిగా మాత్రం నటించను. ఆయన పేరు వింటేనే నాకు రోమాలు నిక్కబోడుచుకుంటాయి. పవన్ కల్యాణ్‌గారి కోసం ఏం చేయడానికైనా రెడీ… రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఆయన నాకెంతో స్ఫూర్తి..హైపర్’ ఆది అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. మా ఇద్దరిపై రూమర్స్ కూడా వచ్చాయి. చాలామంది ‘ఆదిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్’ అని అడుగుతారు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గా ఉన్నా. రూమర్స్ ను పట్టించుకోవాలని అనుకోవడం లేదు ప్రస్తుతానికి నటన పైనే దృష్టి పెట్టాను.. ” అంటూ చెప్పుకొచ్చారు..