Entertainment తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు యాక్టర్ సుబ్బరాయ శర్మ దాదాపు 40 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో దాదాపు 100 చిత్రాలకు పైగా నటించిన ఈయన తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు అంతేకాకుండా తన కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను సైతం తెలిపారు..
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సుబ్బరాయ శర్మ నాటక రంగంలో తన కెరీర్ను మొదలుపెట్టారు ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్ లో నటించారు ఆ తర్వాత సినీరంగం వైపు అడుగులు వేశారు మయూరి చిత్రంతో మంచి పేరును సంపాదించుకున్నారు అలాగే ఈ సినిమాతోనే ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో మంచి పేరును సంపాదించుకున్నారు అలాగే యమలీల మాయలోడు ధర్మచక్రం మల్లీశ్వరి వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు నాజర్ మాధవి జంటగా నటించిన మాతృదేవోభవ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నారు దాదాపు ఇప్పటివరకు ఏదో ఒక రకంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే వస్తున్నారు అయితే ఇన్నాళ్ళ సినీ ఇండస్ట్రీ తనకు ఎన్నో ఇచ్చిందని తెలిపారు జీవితం మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఒకానొక పరిస్థితిలో తన తల్లికి ఆరోగ్యం బాలేని స్థితిలో అనాధాశ్రమంలో ఉంచాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుబ్బరాయ శర్మ..