Entertainment టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సుబ్బరాజు. ఖడ్గం, నేనున్నాను, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఆర్య వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు దాదాపు 50 కి పైగా చిత్రాల్లో నటించారు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, సహాయక పాత్రలో సైతం నటించి మెప్పించగలరు సుబ్బరాజు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు..
యాక్టర్ సుబ్బరాజు తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణాలు కూడా చెప్పకు వచ్చారు.. “చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలా క్రమశిక్షణతో పెంచారు మా నాన్న టీచర్ కావడం వల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది అయితే ఏదో చూసి కొంత ఇష్టపడటం తప్ప డీప్ గా ప్రేమించిన సన్నివేశాలు లేవు పెళ్లి అనేది చేసుకోవాలి కాబట్టి చేసుకోవడం కాదు.. అవసరం వచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలి. నాకు ఇప్పటివరకు ఆ అవసరం రాలేదు. అలాగే నా జీవితంలో సినీ ఇండస్ట్రీ నాకు ఎన్నో ఇచ్చింది అయితే అత్యంత బాధపడిన సందర్భంగా మాత్రం డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు నాకన్నా ముఖ్యంగా నా తల్లి తండ్రి ఏమైపోతారో వారిని ఎవరైనా ప్రశ్నిస్తారేమో అంటూ చాలా భయపడ్డాను ఆ భయంతో రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదు..” అంటూ చెప్పుకొచ్చారు..