Megastar Chiranjeevi : సినీపరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ అనడంలో అతిశయోక్తి కాదు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కరోనా క్రైసిస్ ఛారిటీ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు నిత్యావసరాలు హెల్త్ కిట్స్ వ్యాక్సిన్స్ పంపిణీ చేశారు. ఇవే కాకుండా సినీ జర్నలిస్టులకు ఎన్నో విధాలుగా సాయపడ్డారు. చిరు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తూ ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడుతోన్నారు. సాయం బయటకు చెప్పకుండా మరెంతో మందికి అండగా నిలుస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటుంది మెగా ఫ్యామిలీ. కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడూ అండగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి.
ఒకప్పటి టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ పి దేవరాజ్ పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సహాయం చేశాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో దాదాపు 300 కు పైగా సినిమాలకు కెమెరా మ్యాన్ గా పనిచేసిన దేవరాజ్.. ప్రెజెంట్ ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దేవరాజ్ మాట్లాడుతూ.. ‘నేను జయప్రద, ప్రభ, విజయశాంతి వంటి హీరోయిన్ లకు ఎన్నో సినిమాలు రికమెండ్ చేశాను. కానీ వాళ్ళు ఎవరు నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. నా స్నేహితుడు రజినీకాంత్ నెలకి రూ.5000 ఖర్చులకు పంపిస్తాడు. నటుడు మురళీ మోహన్ టాబ్లెట్స్ కోసం ఒక రూ.3000 పంపిస్తాడు. నాకు ఆపరేషన్ చేయాలి. అందుకు సుమారు 7 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం నేను ఇంటి అద్ది కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను. నేను ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియక చచ్చిపోవాలి అనిపిస్తుంది’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఇక ఆయన పరిస్థితిని తెలుసుకున్న చిరంజీవి దేవరాజ్ కి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం చేశాడు. ఇక ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు జై చిరంజీవ అంటున్నారు. కాగా ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కూడా తన ఉదారత చాటుకున్నారు. పాకీజా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న నటి ‘వాసుకి’ ఆర్ధిక పరిస్థితి ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్న నాగబాబు లక్ష రూపాయిలు సాయం అందించాడు.