రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం కృషి చేస్తున్న టూరిజం అధికారులను నేషనల్ టూరిజం డే (జనవరి 25) నీ పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ, బుద్ధవనం ప్రాజెక్టు ల అధికారులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సూచనల మేరకు పర్యాటకరంగాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లోని పర్యాటక ప్రదేశాలను నిర్లక్ష్యం చేశారన్నారు. CM కేసిఆర్ కృషి వల్ల రామప్ప దేవాలయం కు యునెస్కో వారసత్వ సంపద గా గుర్తింపు లభించిందన్నారు. పోచంపల్లి గ్రామం వరల్డ్ బెస్ట్ టూరిజం విల్లెజ్ గా ఎంపికైందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్దాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్నారు మంత్రి డాక్టర్.V. శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణ పర్యాటక ప్రదేశాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రమోషన్ ను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం కు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం కేంద్రాలను పరిరక్షిస్తూ… వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్, మెడికల్ , వైల్డ్ లైఫ్ టూరిజనికి పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన సెలయేర్లు ,నదులు, జలపాతాలు ఎన్నో ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ టూరిజం ప్రాంతాలలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో టూరిజం మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. టూరిజం ప్రాంతాల గుర్తింపు కోసం ప్రపంచ దేశాలలో తెలంగాణ ప్రమోషన్ కు పెద్దపీట వేసి రాష్ట్రానికి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నామన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో టూరిజం అదికారులు ఓం ప్రకాష్, మహేష్, బుద్ధవనం అధికారులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.