Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. బాబీ దర్శకత్వంలో చిరు నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”. చాలా ఏళ్ల తర్వాత ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం వింటేజ్ మెగాస్టార్ ని గుర్తుచేసింది. ఈ నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. పండగ నాడు పక్కా కమర్షియల్, మాస్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో వచ్చి అభిమానులనే కాక ప్రేక్షకులని కూడా మెస్మరైజ్ చేసింది ఈ సినిమా. తెలుగుతో పాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 1200.. అమెరికాలో 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో కనిపించాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మైత్రీమూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తొలి రోజునే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరి భారీ విజయం సాధించింది. కాగా ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 157.15 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ మూవీ.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మెగా మూవీకి 121.35 కోట్లు రాగా.. అమెరికాలోనూ రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అమెరికాలో 2 మిలియన్ల (రూ.16 కోట్లు) కలెక్షన్స్ సాధించినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ ఏడాది ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది వాల్తేరు వీరయ్య. దీంతో త్వరలోనే రూ. 200 కోట్ల మార్కు దాటడం ఖాయం అని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.
Pure domination of Veerayya at USA Box Office 💥
MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya enters the elite $ 2M club ❤️🔥💥
MEGASTAR @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP #ArthurAWilson @SonyMusicSouth pic.twitter.com/1KUZpM6flv
— Mythri Movie Makers (@MythriOfficial) January 19, 2023