Jailer Movie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా… సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రజినీకాంత్ పోస్టర్స్‌తో పాటు ఈ సినిమాలో ముఖ్య క్యాస్టింగ్‌కు సంబంధించి వరుసగా పోస్టర్స్‌ను రివీల్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ మేరకు తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా జైలర్ మూవీలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఏప్రిల్ 14న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రమ్య కృష్ణన్, వసంత్ రవి, యోగి బాబు మరియు వినాయకన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఇప్పటికే కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు ఇండస్ట్రీలకు సంబంధించిన బడా స్టార్స్ ఒక సినిమాలో కనిపించబోతుండడంతో.. ఈ చిత్రంపై అంచనాలు మరెంత పెరిగిపోయాయి.
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
తెలుగు కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ రీసెంట్‌గా వెల్లడించింది. ఇక ఇప్పుడు తమన్నా కూడా ఈ చిత్రంలో నటించనుండడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. మరి రజినీకాంత్ కి ఈ సినిమా అయినా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.