Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ కి ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూర్ టాకీస్, పిఎస్‌వి గరుడ వేగ చిత్రాలతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా #Vt12 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
అయితే తాజాగా ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్ సినిమా టైటిల్‌తో పాటు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. దీంతో మెగా అభిమానులు అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మేయ వేదికగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. లండన్ బ్రిడ్జ్‌పై యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేస్తుంది. ఇందులో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.
Keeping peace is a bloody business!🔥#GandeevadhariArjuna@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/HQQxaZ65oV
— Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2023
అయితే ఈ సినిమాలో మొదటిసారిగా వరుణ్ తేజ్ గూడచారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేశారు. మరోవైపు ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ వరుణ్ తేజ్ అభిమానులు అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయనకు పుట్టిన రోజు విషెస్ చెబుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గూడచారి నేపథ్యంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేసుకున్న నేపథ్యంలో గాండీవధారి అర్జునపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.