చాలాకాలం నుండే స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. దీనికి కారణం అవసరం కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, అందరికీ అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్స్ లభించడం కావచ్చు. చాలామందికి తమ ఫోన్ గురించి తమకే పూర్తిగా తెలీదు. అంటే, తమ ఫోన్ సమాచారాన్ని గానీ, ఇతర విలువైన సమాచారాన్ని గానీ తెలుసుకోవాలంటే ఏ నెంబర్స్ డయల్ చేయాలనేది చాలామందికి తెలీదు. అలా తెలీనివాళ్లకు తెలిపేందుకే ఈ ఆర్టికల్.
ఫోన్ కు సంబంధించిన సమాచారం, బ్యాటరీకి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ##4636##* నెంబర్ డయల్ చేయాలి. అలాగే మన ఫోన్ ఐ.ఎం.ఇ.ఐ. నెంబర్ కోసం #06#, కొత్త ఫోన్లలో సర్వీస్ మెనో కోసం *#0#, కెమెరాకు సంబంధించిన పూర్తి సమాచారానికై ##34971539##, మీడియా ఫైల్స్ కోసం *##273282*255*663282*##, వైర్ లెస్ ల్యాన్ టెస్ట్ కోసం ##232339##, టచ్ స్క్రీన్ టెస్ట్ కోసం ##2664##, వైబ్రేషన్ టెస్ట్ ##0842##, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సమాచారానికై *#12580*369#, డయాగ్నోస్టిక్ కాన్ఫిగరేషన్ కోసం, *#9090#, ఫోన్ లాక్ స్టేటస్ *#7465625# నెంబర్ ని డయల్ చేయాలి.