దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు (సోమవారం) వారసుడు తెలుగు విడుదల తేదిని తెలియజేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. తమిళ్ లో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విదుదలౌతుంది. ఈ నిర్ణయం వెనుక వున్న కారణం.. జనవరి 12 బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి, జనవరి 13న చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలౌతున్నాయి. ప్రతి థియేటర్ లో ముందు మన తెలుగు బిగ్గర్ స్టార్స్ సినిమాలు పడాలి. అన్ని చోట్ల వారికి థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను.
సంక్రాంతి సినిమాలకి మా వారసుడు పోటి కాదని మొదటి నుండి చెబుతున్నాను. మాది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు సంక్రాంతి వారసుడు చేయాలనేదే నా ప్రయత్నం. బాలకృష్ణ గారి చిరంజీవి గారి సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రిలీజ్ కావాలి. తర్వాత నా సినిమా రావాలని పాజిటివ్ గానే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అందరం బావుండాలనే నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ఇవి కూడా చదవండి : – Politics : జర్నలిజానికి నిజమైన అర్థం మర్చిపోతున్నాం.. కొమ్మినేని శ్రీనివాసరావు , Film News : ‘చోరుడు’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సూపర్ స్టార్ ధనుష్