Entertainment టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే చేసుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టారు.. ప్రస్తుతం మీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలతో కలిసి క్రిస్ మస్ తో పాటు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్ళారు… అక్కడ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యామిలీతో పాటు లండన్ లో సందడి చేసిన ఈ హీరో తాజాగా హైదరాబాద్ వచ్చేసారు..
తన పిల్లలతో పాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లారు మహేష్ బాబు.. దీనికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే వస్తున్నారు.. ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుకున్నట్టుగానే వెకేషన్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు సూపర్ స్టార్ ఫ్యామిలీ. ఎయిర్‌పోర్టులో మహేష్ బాబుతో పాటుగా..నమ్రత శిరోద్కర్ వారి పిల్లలు సితార, గౌతమ్ లాండ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం చిత్రికను దశలో ఉన్న ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.. త్వరలోనే ఈ సినిమా విడుదలకు కాబోతుంది..