Entertainment కన్నడ రాక్స్టార్ తన అభిమానులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇప్పటికే ఈ విషయాన్ని పలు మార్లు నిరూపించుకున్న స్టార్ హీరో తాజాగా తన అభిమానులకు ఓ లేఖ రాశారు అందులో ఏముందంటే..
కన్నడ స్టార్ హీరో యశ్ తాజాగా తన అభిమానులకు ఓ లేక రాశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో ఏముందంటే.. ఈయన ఎప్పుడూ కూడా తన పుట్టినరోజును అభిమానులతోనే జరుపుకుంటూ ఉంటారు కానీ ఏడాది మాత్రం ఈ అవకాశం లేదంటూ తాను ఇండియాలో ఉండడం లేదంటూ చెప్పకు వచ్చారు.. ఈ సందర్భంగా తన అభిమానులు నిరాశ పడకూడదని లేఖ రాసుకొచ్చారు..
జనవరి 8న యశ్ పుట్టినరోజు ఈ సందర్భంగా అభిమానులు కలవనందుకు.. “ఏడాది పొడవునా నాపై అభిమానం చూపిస్తూ.. నా పుట్టినరోజు సందర్భంగా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయతలు నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపేస్తుంది. సంవత్సరమంతా మీరు చూపించే ప్రేమని.. ఎంతోకొంత మీకు తిరిగి ఇవ్వడానికి నా పుట్టినరోజున మిమ్మల్ని కలవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నా పుట్టినరోజున నేను సిటీలో ఉండటం లేదు. అందుకే ఈసారి నేను మీ అందరినీ కలవలేకపోతున్నా. అన్నారు. కానీ మాట ఇస్తున్న మిమ్మల్ని తప్పకుండా త్వరలో కలుస్తాను.. ” అంటూ చెప్పకొచ్చారు హీరో యశ్.. యశ్ రాసిన ఈ లేఖ పై ఆయన అభిమానులంతా కొంతవరకు నిరాశ చెందిన అతని మంచి మనసుకు ఫిదా అయిపోతున్నారు అలాగే ఎక్కడ ఉన్నా హ్యాపీగా పుట్టినరోజు జరుపుకోండి అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు..