Entertainment క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్, నరేష్ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది విషయంపై తాజా జంట పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ క్లారిటీ ఇచ్చేసినట్టు తెలిసింది అంతేకాకుండా న్యూయార్ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు.. కానీ అదంతా నిజం కాదని తెలుస్తొంది..
డిసెంబర్ 31న సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ పంచుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. వెల్కమ్ టు అవర్ వరల్డ్ అంటూ కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు కేక్ తినిపించుకున్నారు. అలాగే ఇద్దరం ఒక్కటవుతున్నామే అర్థం వచ్చేలా ‘లిప్ లాక్’ చేసుకున్నారు.. అయితే ఇదంతా నిజం కాదని తెలుస్తోంది వీరిద్దరూ నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమా.. ప్రమోషన్ కోసం చేశారంటూ అసలు విషయం బయటకు వచ్చింది.. ఇది తెలుసుకున్న వారంతా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులు చేయడం అవసరమా అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..
అయితే గత కొంతకాలంగా నరేష్ పవిత్ర లోకేష్ ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తూ ఉన్నారు.. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు కూడా వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా కనిపించారు.. అలాగే వీరిద్దరూ ఇప్పటికే పలు చిత్రాల్లో కలిసి నటించారు.. ఎక్కడ చూసినా వీరిద్దరూ కనిపించడంతో వీరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ దాన్ని ఖండిస్తూ వచ్చారు. అయితే ఏదో ఉందని మాత్రం నటిజన్లో గట్టిగానే ఫిక్స్ అయిపోయారు అసలు విషయం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి..