Entertainment యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా శ్రీకాళహస్తిలో పూజలు జరిపించుకున్నారు అయితే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. అంతేకాకుండా ఈ ఏడాది నేను పంచుకుంటున్నా మొదటి ఫోటోలు ఇవే అంటూ కూడా ట్యాగ్ చేశారు..
ప్రస్తుతం తెలుగులో బిజీ యాంకర్ లో ఒకరుగా ఉన్నారు అనసూయ గత ఏడాది వరకు జబర్దస్త్ లో నటిస్తూ వస్తున్న ఈమె తాజాగా మాత్రం కొంత బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది.. అలాగే ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు అనసూయ.. ఏ మాత్రం సమయం దొరికిన కుటుంబానికి కేటాయిస్తూ వెళ్తూ ఉంటారు అయితే ఈసారి మాత్రం శ్రీకాళహస్తి గుడికి వెళ్ళినట్టు తెలుస్తోంది.. అయితే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా పూజలు జరిపించారు అలాగే సోషల్ మీడియాలో పంచుకున్నారు.. అంతేకాకుండా 2023లో నేను పోస్ట్ చేస్తున్న ఫస్ట్ ఫోటో ఫోటోలు ఇవే అంటూ కూడా చెప్పుకొచ్చారు..
ప్రస్తుతం ఎటు యాంకరింగ్ తో అటువైపు సినిమాలతో అనసూయ చాలా బిజీగా ఉన్నట్టే తెలుస్తుంది 2023లో ఈమె నటించిన పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న రంగమార్తాండ చిత్రంలో కీలకపాత్ర పోషించారు అనసూయ అల్లు అర్జున్ సంపాదించి పెట్టిన పుష్ప చిత్రానికి సిక్వెల్ గా రాబోతున్న పుష్ప టు లో కూడా అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం… అలాగే పుష్ప చిత్రంలో విలన్ గా నటించిన సునీల్ కు భారీగా అనసూయ కనిపించిన సంగతి తెలిసిందే..