Entertainment ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మరొకసారి సమాజంపై తనకున్న బాధ్యతను చాటుకున్నారు..
సురేష్ బాబు సమాజం పై తనకున్న బాధ్యతను చాటుకున్నారు ఒక సాధారణ వ్యక్తి లాగా స్పందించి సమస్యను పరిష్కరించారు వివరాల్లోకి వెళితే.. గత రాత్రి ఫిల్మ్ నగర్లో ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడే ఉన్న ఆయన తన కారులో నుంచి దిగి వాహనాల రద్దీని నియంత్రిస్తూ రాకపోకలకు సుగమం చేశారు. దీంతో పలువురు వాహనదారులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు కదిలారు.
గత రాత్రీ భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆగిపోయింది.. అయితే రద్దీ సమయాల్లో ఎప్పటికప్పుడు ఇలానే జరుగుతూ ఉండటం చూస్తూనే ఉంటాము.. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అని చెప్పవచ్చు వర్షం వస్తే ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది అలాగే సాయంత్రం సమయాల్లో ఉదయం సమయాల్లో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పాలి.. అయితే తాజాగా మళ్లీ ఇలాంటి విషయమే జరిగింది దీంతో ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు
అటుగా వెళుతూ ఈ విషయాన్ని చూసి తన వంతు సహాయాన్ని చేశారు కార్ లోంచి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.. తాజాగా జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చల్లా చదరగా ఉన్న వాహనాలకు దారి చూపిస్తూ కలిశారు ఇతను ఇలా చేయడం చూసిన మరి ఒక ఇద్దరు అతనితో కలిసి మొత్తం ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది దీంతో అందరూ కూడా అతనికి సామాజిక బాధ్యత ఉందంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు..