Entertainment టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూనే వస్తుంది ముఖ్యంగా కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకున్న విషయంపై పలు రూమర్లు వస్తున్నప్పటికీ దీనిపై ఎవరు స్పందించలేదు అయితే తాజాగా శ్రీజ ఒక ఎమోషనల్ పోస్టును తన ఇంస్టాగ్రామ్ లో ఉంచింది ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది..
న్యూ ఇయర్ సందర్భంగా శ్రీజ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసే చాన్స్ ఇచ్చిన 2022కు థాంక్స్ చెప్పింది. దీంతో త్వరలోనే మరో వ్యక్తితో ఆమెకు మూడో పెళ్లి జరగనుందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి..
2022లో తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కలిశానని ఇందులో పేర్కొంది. శ్రీజ పోస్ట్ చేసిన వీడియో గ్లింప్స్‌లో.. ‘డియర్ 2022, జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేందుకు నన్ను అనుమతించినందుకు థాంక్స్. నా గురించి బాగా తెలిసిన, నన్ను అన్‌కండిషనల్‌గా ప్రేమించే, నన్ను ప్రతి క్షణం పట్టించుకుని ఓదార్చే, ఎత్తుపల్లాల మధ్య ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి అతనే’ అని పోస్టు చేసింది.. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఆ వ్యక్తి ఎవరు అంటూ పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి అలాగే అతనితో త్వరలోనే శ్రీజ ఏడడుగులు వేయబోతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే అసలు విషయం ఏంటి అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..